18 కొండలకు ప్రతీకలే 18 మెట్లు
అమృతభాండం రాక్షసులకు దక్కకుండగా చేయడం కోసం, శ్రీమహావిష్ణువు 'మోహిని' రూపాన్ని ధరించాడు. ఆ రూపాన్ని చూసిన పరమశివుడు మోహావేశానికి లోనయ్యాడు. ఫలితంగా ఒక మగబిడ్డ కలగడంతో, ఆ బిడ్డ మెడలో 'మణిమాల'ను వేశాడు సదాశివుడు. దాంతో ఆ బిడ్డ 'మణికంఠుడు' పేరుతో పందళరాజు ఇంట పెరిగి పెద్ద వాడయ్యాడు. అయ్యప్పస్వామిగా 'శబరిమల'లో కొలువుదీరాడు.
మండల దీక్ష తీసుకున్నవారు 18 పవిత్రమైన మెట్లను ఎక్కుతూ వెళ్లి స్వామి దర్శనం చేసుకోవాలి. స్వామి దర్శనం కోసం వెళ్లే దారిలో కాళ్తే కట్టి .. ఇంజిపారై .. పుదుచ్చేరి మలై .. శబరమలై .. నీలిమలై .. పొన్నంబలమేడు .. చిట్రంబలమేడు .. మయిలాడుంమేడు .. తలైపారై .. నీలక్కల్ .. దేవన్ మలై .. శ్రీపాదమలై .. కల్కి మలై .. మాతంగమలై .. సుందరమలై .. నాగమలై .. గవుండమలై కొండలను దర్శిస్తూ శబరిమలై కొండకు చేరుకోవడం జరుగుతుంది. ఈ 18 కొండలకు ప్రతీకగానే స్వామివారి సన్నిధికి ముందు 18 పవిత్రమైన మెట్లు ఉన్నాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఇరుముడులతో భక్తులు ఈ మెట్ల ద్వారానే వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుని తరిస్తుంటారు.