నీలం శంఖం పుష్పాలతో శనిదేవుడికి పూజ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నీలం శంఖం పుష్పాలతో శనిదేవుడికి పూజ

నీలం శంఖం పుష్పాలతో శనిదేవుడికి పూజ
శని దేవుడి పేరు వినగానే సహజంగానే చాలామంది భయపడుతూ వుంటారు. ఎందుకంటే ఆయన చూపే ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. జీవితంలో అనేక ఆటంకాలను కలిగిస్తూ .. అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుంటాడు. ఆరోగ్య పరంగాను .. ఆర్ధిక పరంగాను సమస్యలను సృష్టిస్తూ సతమతం చేస్తుంటాడు. ఒకదాని తరువాత ఒకటిగా కష్టనష్టాలను కలిగిస్తూ .. సమయానికి ఎవరి సహాయమూ అందకుండా చేస్తూ నిరాశా నిస్పృహలను కలిగిస్తూ ఉంటాడు.

అలాంటి శని దేవుడిని శాంతిపచేయడానికి అనేక మార్గాలు సూచించబడ్డాయి. వాటిలో 'నీలం శంఖం' పూలతో ఆ స్వామిని పూజించడం ఒకటి. దేవతలకే కాదు .. గ్రహాలకు కూడా కొన్ని రకాల పూలు ప్రీతికరమైనవిగా చెప్పబడుతున్నాయి. దేవతలకి ఇష్టమైన పూలతో పూజించడం వలన వాళ్లు ప్రీతి చెందుతారు. అలాగే శని దేవుడికి ఇష్టమైన 'నీలం శంఖం' పూలతో అనునిత్యం ఆ స్వామిని పూజించాలి. ఈ విధంగా చేయడం వలన ఆయన శాంతిస్తాడు .. ఆయన అనుగ్రహం కారణంగా శని దోష ప్రభావం తగ్గుముఖం పడుతుంది.        

More Bhakti Articles