కార్తీకంలో దీపదాన వ్రతం
కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు .. ఈ మాసంలో చేసే పూజలు .. నోములు .. వ్రతాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో చేసే వ్రతాలలో 'దీపదాన వ్రతం' ఒకటిగా చెప్పబడుతోంది. కార్తీక మాసంలో సోమవారాలు విశేషమైనవి కనుక .. ఈ రోజుల్లో చేసే దీపదానం అనంతమైన పుణ్య ఫలాలను ఇస్తుంది. దీప దానవ్రతం 'కార్తీక పౌర్ణమి' రోజున చేయడం వలన మరింత విశేషమైన ఫలితం ఉంటుంది.
ఈ రోజున పైడి పత్తితో స్వయంగా వత్తులను సిద్ధం చేసుకుని .. వరి లేదా గోధుమ పిండితో ప్రమిదలను తయారు చేసుకోవాలి. ఆ ప్రమిదలను ఆవు నెయ్యితో వెలిగించి నమస్కరించాలి. ఇలా వెలిగించిన దీపాన్ని శివాలయాలలోగానీ .. నదీ తీరాలలో గాని బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. ఈ విధంగా దీప దానం చేయడం వలన అజ్ఞానం తొలగిపోవడమే కాకుండా, జన్మజన్మల పాటు వెంట వచ్చే పుణ్య ఫలాలు లభిస్తాయి.