దుర్గాదేవి ఇలా ప్రీతి చెందుతుంది!
దుర్గతులను నివారించే తల్లిగా దుర్గాదేవి పూజలందుకుంటోంది. దేవతలు .. మహర్షులు ఆ తల్లిని అనునిత్యం పూజిస్తుంటారు. ఎంతోమంది మహాభక్తులు ఆ తల్లిని సేవిస్తుంటారు. ఇక సంతాన సౌభాగ్యాలను ప్రసాదించే అమ్మవారిని స్త్రీలు ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ధూప .. దీప .. నైవేద్యాలను సమర్పిస్తుంటారు. అంకితభావంతో సేవిస్తే అమ్మవారు అనుగ్రహిస్తుందని విశ్వసిస్తుంటారు.
అమ్మవారు ప్రీతి చెందాలంటే .. ఆ తల్లికి ఇష్టమైన పూలను సమర్పించవలసి ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అమ్మవారికి మల్లెలు .. సంపెంగలు .. కలువలు .. తామరలు .. పున్నాగలు .. గన్నేరులు చాలా ప్రీతికరమైనవట. ఈ పూలతో పూజలందుకోవడానికి అమ్మవారు ఇష్టాన్ని చూపుతుంది. అందువలన ఈ పూలతో అమ్మవారిని పూజించాలి. ఈ విధంగా చేయడం వలన అమ్మవారు ప్రీతి చెంది .. సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.