లక్ష్మీదేవి ఇలా అనుగ్రహిస్తుందట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లక్ష్మీదేవి ఇలా అనుగ్రహిస్తుందట!

లక్ష్మీదేవి ఇలా అనుగ్రహిస్తుందట!
జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా .. ఆర్ధికంగా బలంగా వుంటే కొంతవరకూ ఆ సమస్యలను ఎదుర్కునే అవకాశం వుంటుంది. అసలు సమస్యే ఆర్ధికపరమైనది అయినప్పుడు, ఎవరైనా సరే అధైర్యంతో డీలాపడిపోతారు. అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే, లక్ష్మీదేవి అనుగ్రహం వుండాలి. ఆ తల్లి కరుణా కటాక్షాలు పొందాలంటే, అనునిత్యం పూజిస్తూ .. సేవిస్తూ వుండాలి.

అమ్మవారిని ఎలాగూ పూజిస్తున్నాం కదా అని, ఎలాంటి ప్రయత్నం చేయకుండా కూర్చోకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవికి ఎంతమాత్రం నచ్చనిది సోమరితనమే. అందుకే ఎవరివంతుగా వాళ్లు శ్రమిస్తూనే, ఆ తల్లికి ఇష్టమైన తీరుగా నడచుకుంటూ వుండాలి. ఎవరైనా అతిథులు వస్తున్నారని తెలిసినప్పుడు, ఇల్లంతా పరిశుభ్రంగా వుంచడం జరుగుతూ వుంటుంది. ఇక వచ్చేది లక్ష్మీదేవి అయినప్పుడు మరింత పరిశుభ్రంగా ఇల్లు ఉండేలా చూసుకోవాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

ఉదయాన్నే అంతా నిద్రలేచి .. వాకిట్లో ముగ్గుపెట్టి .. పూజా మందిరంతో పాటు ఇల్లంతా పరిశుభ్రంగా ఉంచితే, లక్ష్మీదేవి తప్పకుండా వస్తుందట. ఇక అమ్మవారు వాకిట్లో ముగ్గు దగ్గర నుంచుని లోపలికి చూసినప్పుడు, పెరట్లో తులసి కోట కనిపిస్తే .. ఆ తల్లి వెంటనే ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందువలన పెరట్లో తులసి కోటను ఉంచాలి. ఎలాంటి గొడవలు పడకుండా .. నిజాయితీగా మసలుకుంటూ .. ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం ఇంట్లో వుంచినట్టయితే, ఆ తల్లి అక్కడ ఎక్కువ కాలం స్థిరంగా ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.

More Bhakti Articles