కొలనుపాకలో కొలువైన క్షేత్రం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొలనుపాకలో కొలువైన క్షేత్రం

కొలనుపాకలో కొలువైన క్షేత్రం
భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు పురాణ నేపథ్యంతో పాటు చారిత్రక వైభవం కలిగినవిగా విలసిల్లుతున్నాయి. అలంటి విశిష్టమైన క్షేత్రాల్లో చారిత్రక వైభవం అధికంగా కలిగిన క్షేత్రం మనకి నల్గొండ జిల్లాలోని 'కొలనుపాక'లో కనిపిస్తుంది. హరిహర క్షేత్రంగానే కాకుండా ప్రపంచ ప్రసిద్ధి చెందిన జైన దేవాలయం కొలువై ఉండటం ఇక్కడి విశేషం.

ప్రాచీన కాలంలో 'దక్షిణకాశి'గా పిలిపించుకున్న ఈ క్షేత్రంలో శివుడు 'భూలింగేశ్వర సోమేశ్వర స్వామిగా దర్శనమిస్తూ ఉంటాడు. ఇక శ్రీమహావిష్ణువు .. వీరనారాయణస్వామిగా కొలువుదీరి కనిపిస్తూ ఉంటాడు. చాళుక్యులు ... కాకతీయుల కాలంలో ఒక వెలుగు వెలిగిన ఈ క్షేత్రం, జైనులచే సైతం అదేస్థాయిలో ఆరాధించబడింది.

భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన జైన దేవాలయాల్లో కొలనుపాక ఏడవ స్థానంలో కనిపిస్తుంది. ఫిరోజ్ అనే అత్యంత విలువైన రత్నాలను పొందుపరచబడిన ఇక్కడి మహావీరుడి విగ్రహాన్ని చూసితీరవలసిందే. ప్రతి ఏడాది చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున ఇక్కడ మహావీరుడికి జరిగే రథోత్సవం చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి వేల సంఖ్యలో జైనులు తరలివస్తుంటారు.

More Bhakti Articles