ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్... గుర్తుపట్టారా?

ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్... గుర్తుపట్టారా?
  • చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన నీలిమారాణి 
  • తమిళ సినిమాలతో బిజీగానే ఉన్నానని వెల్లడి
  • కష్టపడి పైకొచ్చానని వివరణ  
  • హడావిడి చేయడం చేతకాదని వ్యాఖ్య

చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సీరియల్స్ లో, సినిమాలలో కనిపించిన నీలిమారాణి చాలామందికి గుర్తుండే ఉంటుంది. 'ఇది కథ కాదు'... 'వసుంధర'... 'కళంకిత' వంటి సీరియల్స్ ద్వారా ఆమెకి మంచి పేరు వచ్చింది. ఆ తరువాత ఎక్కువగా తమిళ సీరియల్స్, తమిళ సినిమాలతో బిజీ అవుతూ వచ్చింది. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

'నేను నటించిన ఫస్ట్ సీరియల్ 'కిట్టిగాడు'... ఫస్టు మూవీ 'క్షత్రియ పుత్రుడు'. ఆ తరువాత వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి... నేను చేస్తూనే వెళ్లాను. కెరియర్ ఆరంభంలో 'విధి' వంటి సీరియల్ లో నాకు పెద్ద రోల్ దక్కడం నా అదృష్టంగా భావిస్తాను. తమిళంలో నేను చేసిన సినిమాలు తెలుగులోకి డబ్ అవుతూ ఉండటం వలన తెలుగు ఆడియన్స్ నన్ను గుర్తుపెట్టుకున్నారు. తెలుగులో నేరుగా చేయకపోవడానికి కారణం, అవకాశాలు రాకపోవడమే" అని అన్నారు. 

"నేను కష్టపడి పైకి వచ్చాను... అందువలన సహజంగానే నేను హడావిడి చేయలేను. నాకు నేనుగా డిస్ ప్లే చేసుకోలేను. ఇంతవరకూ వచ్చిన అవకాశాలన్నీ కూడా నా యాక్టింగ్ గురించి తెలిసినవారే పిలిచి ఇచ్చారు. సీరియల్స్ చేస్తూ కోట్లు సంపాదించడమనేది దాదాపుగా జరగదు. ఆర్ధికంగా చూసుకుంటే మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది. తెలుగు నుంచి అవకాశాలు వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను" అని చెప్పారు. 



More Telugu News