హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల కలకలం
  • ఎక్స్‌పోలో ఇద్దరు దుకాణదారుల మధ్య ఘర్షణ
  • తన వద్ద ఉన్న తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపిన ఒక దుకాణదారుడు
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
హైదరాబాద్ నగరంలోని గుడిమల్కాపూర్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఇక్కడి కింగ్స్ ప్యాలెస్‌లో జరుగుతున్న 'ఆనం మీర్జా' ఎక్స్‌పోలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఇద్దరు దుకాణదారుల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఒక దుకాణదారుడు గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో ఎక్స్‌పోకు వచ్చిన సందర్శకులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాల్లోకి కాల్పులు జరిపిన దుకాణదారుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. 

ఆనం మీర్జా... ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి. రంజాన్ సీజన్ నేపథ్యంలో ఆమె తన పేరిట ఎక్స్ పో ఏర్పాటు చేసినట్టు  తెలుస్తోంది.


More Telugu News