టికెట్ ధ‌ర‌ల పెంపుపై 'రాబిన్‌హుడ్' మేక‌ర్స్‌ కీల‌క ప్ర‌క‌ట‌న‌

టికెట్ ధ‌ర‌ల పెంపుపై 'రాబిన్‌హుడ్' మేక‌ర్స్‌ కీల‌క ప్ర‌క‌ట‌న‌
 
ఉగాది సంద‌ర్భంగా విడుద‌ల‌య్యే కొత్త సినిమాల టికెట్ ధ‌రల పెంపున‌కు ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చిందనే వార్త‌ నెట్టింట వైర‌ల్‌గా మారింది. నితిన్ 'రాబిన్‌హుడ్‌'తో పాటు 'మ్యాడ్ స్క్వేర్' చిత్రాల టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింద‌నేది ఆ వార్త సారాంశం. 

ఈ అంశంపై తాజాగా రాబిన్‌హుడ్ మేక‌ర్స్ స్పందించారు. ఈ నేప‌థ్యంలోనే సోష‌ల్ మీడియా వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఏపీలో కొన్ని ఎంపిక చేసిన ప్రీమియం థియేట‌ర్లలోనే టికెట్ ధరల పెంపు ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఏపీలో మిగతా థియేటర్లలోనూ, తెలంగాణ‌లో పూర్తిగా... టికెట్ ధ‌ర‌ల పెంపు ఉండదని, సాధారణ టికెట్ ధరలకే సినిమా చూడొచ్చని ప్ర‌క‌టించింది. 

టికెట్ ధ‌ర‌ల పెంపుపై జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని కొట్టిపారేసింది. అభిమానుల‌కు స‌ర‌స‌న‌మైన ధ‌ర‌ల‌కే ఎంట‌ర్‌టైన్మెంట్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు పేర్కొంది. స‌మీప థియేట‌ర్ల‌లో ఈ నెల 28న రాబిన్‌హుడ్ సినిమా చూసి ఆనందించాల‌ని మేక‌ర్స్ కోరారు. 


More Telugu News