అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం .. ముగ్గురు మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం .. ముగ్గురు మృతి
  • న్యూమెక్సికోలో రెండు గ్రూప్‌ల మధ్య కాల్పులు
  • ముగ్గురు యువకులు మృతి, 15 మందికి గాయాలు
  • అనుమతి లేని ఓ కారు ప్రదర్శన సందర్భంగా రెండు గ్రూప్‌ల మధ్య ఘర్షణ
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. న్యూమెక్సికో రాష్ట్రంలోని లాస్ క్రూసెస్ నగరంలో రెండు గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు.

ఈ ఘటనపై లాస్ క్రూసెస్ పోలీస్ అధికారి జెరేమీ స్టోరీ మాట్లాడుతూ.. అనుమతి లేని కారు ప్రదర్శన సందర్భంగా రెండు గ్రూపుల మధ్య ఈ కాల్పులు జరిగాయని తెలిపారు. మృతుల్లో ఇద్దరు టీనేజర్లు ఉన్నారని, గాయపడిన వారంతా 16 నుంచి 36 సంవత్సరాల వయస్సు మధ్యవారేనని చెప్పారు.

సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టామని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు ఆయన వెల్లడించారు. 


More Telugu News