చెన్నైలో మాజీ గవర్నర్ నరసింహన్ నివాసానికి వెళ్లిన కేటీఆర్

చెన్నైలో మాజీ గవర్నర్ నరసింహన్ నివాసానికి వెళ్లిన కేటీఆర్
  • పునర్విభజన సదస్సులో పాల్గొనేందుకు చెన్నైకి వచ్చిన కేటీఆర్
  • సదస్సు అనంతరం నరసింహన్ నివాసానికి చేరుకున్న కేటీఆర్
  • శాలువా కప్పి సన్మానించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న కేటీఆర్
తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్ నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. చెన్నైలో నిర్వహించిన లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన సదస్సులో పాల్గొనేందుకు ఆయన చెన్నైకి వచ్చారు. ఈ సదస్సు అనంతరం కేటీఆర్ చెన్నైలోని నరసింహన్ నివాసానికి వెళ్లారు.

నరసింహన్ దంపతులను కేటీఆర్ శాలువాతో కప్పి సన్మానించారు. అనంతరం వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నరసింహన్ దంపతులను కలిసిన వారిలో బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఉన్నారు.


More Telugu News