మెదక్ సెంట్రల్ జీఎస్టీ సూపరింటెండెంట్ రవిరంజన్‌ని అదుపులోకి తీసుకున్న సీబీఐ

మెదక్ సెంట్రల్ జీఎస్టీ సూపరింటెండెంట్ రవిరంజన్‌ని అదుపులోకి తీసుకున్న సీబీఐ
  • వ్యాపారి నుంచి లంచం తీసుకుంటూ సీబీఐకి దొరికిపోయిన సెంట్రల్ జీఎస్టీ మెదక్ రేంజ్ అధికారి రవిరంజన్ 
  • జీఎస్టీ నంబర్ పునరుద్దరణకు రూ.10వేలు డిమాండ్ చేసిన వైనం
  • రవిరంజన్‌ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించిన సీబీఐ అధికారులు
మెదక్‌లోని సెంట్రల్ జీఎస్టీ సూపరింటెండెంట్ రవిరంజన్ అగర్వాల్ ఓ వ్యాపారి నుంచి లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. పెద్ద శంకరంపేట మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన వ్యాపారి తలారి కృష్ణమూర్తి తన జీఎస్టీ నంబర్ పునరుద్ధరణకు జీఎస్టీ అధికారి రవిరంజన్‌కు రూ.8 వేలు ఇస్తుండగా సీబీఐ అధికారులు పట్టుకున్నారు.

సదరు వ్యాపారికి సంబంధించి ఎలక్ట్రికల్స్ హార్డ్‌వేర్ దుకాణం యొక్క జీఎస్టీ నంబర్ గత ఏడాది డిసెంబర్‌లో సస్పెండ్ కావడంతో, ఆయన మెదక్ కార్యాలయ సూపరింటెండెంట్ రవిరంజన్‌ను కలిశారు. దీనికి గాను రూ.10 వేలు లంచంగా ఇవ్వాలని రవిరంజన్ డిమాండ్ చేశాడు.

దీనిపై వ్యాపారి కృష్ణమూర్తి సీబీఐ అధికారులకు సమాచారం ఇవ్వగా, శుక్రవారం సీబీఐ ఇన్‌స్పెక్టర్ ధనుంజయ్ నేతృత్వంలో అధికారులు వ్యూహం పన్ని రవిరంజన్ అగర్వాల్‌ను పట్టుకున్నారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించారు. 


More Telugu News