అరెస్టు చేయవద్దు, కానీ: యాంకర్ శ్యామలకు హైకోర్టులో ఊరట

అరెస్టు చేయవద్దు, కానీ: యాంకర్ శ్యామలకు హైకోర్టులో ఊరట
  • బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన కేసులో శ్యామలపై కేసు
  • పోలీసుల విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశాలు
  • సోమవారం నుండి విచారణకు హాజరు కావాలన్న హైకోర్టు
తెలుగు యాంకర్ శ్యామలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆమెను అరెస్టు చేయవద్దని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో పోలీసులు విచారణను కొనసాగించవచ్చునని, శ్యామల విచారణకు సహకరించాలని ఆదేశించింది. సోమవారం నుండి పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది.

బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన కేసులో యాంకర్ శ్యామలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సుమారు 11 మందిపై కేసులు నమోదు కాగా, వారందరినీ పోలీసులు విచారణకు పిలుస్తున్నారు. శ్యామల విచారణకు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో శ్యామల హైకోర్టును ఆశ్రయించారు.

బెట్టింగ్ యాప్‌లకు సంబంధించి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం పై ఆదేశాలు ఇచ్చింది.


More Telugu News