గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తెకు ఎన్టీకేలో కీలక పదవి

గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తెకు ఎన్టీకేలో కీలక పదవి
     
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను ముప్పుతిప్పలు పెట్టిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యారాణి వీరప్పన్‌‌ను కీలక పదవి వరించింది. గతేడాది ఆమె నామ్ తమిళర్ కట్చి (ఎన్‌టీకే)లో చేరారు. ఆ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో  ఆమె కృష్ణగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 

ఈ నేపథ్యంలో ఆమెను పార్టీ యూత్ బ్రిగేడ్ రాష్ట్ర కన్వీనర్లలో ఒకరిగా నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన సమన్వయకర్త సీమాన్ ప్రకటించారు. విద్యారాణి తొలుత పీఎంకేలో పనిచేశారు. 2020లో బీజేపీలో చేరి ఓబీసీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. 2024లో ఆ పార్టీకి రాజీనామా చేసి ఎన్టీకేలో చేరారు.  


More Telugu News