మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాప్‌ల ప్రకటనలు... స్పందించిన ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాప్‌ల ప్రకటనలు... స్పందించిన ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
  • కొన్ని మెట్రో రైళ్లపై ప్రకటనలు ఉన్నట్లు దృష్టికి వచ్చిందన్న ఎన్వీఎస్ రెడ్డి
  • ఇలాంటి ప్రకటనలను వెంటనే తొలగించాలని ఆదేశించామని వెల్లడి
  • ఈరోజు మెట్రో సేవల అనంతరం తొలగిస్తామని స్పష్టీకరణ
కొన్ని మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి ప్రకటలను వెంటనే తొలగించాలని ఎల్ అండ్ టీ, సంబంధిత అడ్వర్టైజ్‌మెంట్ ఎజెన్సీలను ఆదేశించామని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఈరోజు మెట్రో సేవల అనంతరం ఈ ప్రకటనలను అన్నింటినీ తొలగిస్తామని స్పష్టం చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన అంశం చర్చనీయాంశంగా మారింది. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన నటీనటులకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు యూట్యూబర్లపై కేసులు నమోదయ్యాయి.

ఈ క్రమంలో మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన ప్రకటనలు ఉండటాన్ని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. దాంతో, మెట్రో రైళ్ల మీద ఉన్న ప్రకటనలపై ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు.


More Telugu News