బాలకృష్ణ-ఊర్వశి రౌతేలా పాటపై మహిళా కమిషన్ ఆగ్రహం

బాలకృష్ణ-ఊర్వశి రౌతేలా పాటపై మహిళా కమిషన్ ఆగ్రహం
  • తెలుగు సినిమా పాటల ధోరణిపై మహిళా కమిషన్ సీరియస్
  • అసభ్యకర పదాలు, అభ్యంతరకర డ్యాన్స్ మూమెంట్స్ ఉంటున్నాయని ఆగ్రహం
  • మహిళలను గ్లామర్ కోణంలో చూపించడం సరికాదన్న కమిషన్
ఇటీవల వస్తున్న తెలుగు సినిమాల పాటల్లో అసభ్యకర పదాలు, అభ్యంతరకర డ్యాన్స్ మూమెంట్స్‌పై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. బాలకృష్ణ నటించిన 'ఢాకు మహారాజు' సినిమాలోని 'దబిడి దిబిడి' పాటపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాటలో బాలయ్య, ఊర్వశి రౌతేలా నటించారు. ఇందులోని కొన్ని స్టెప్పులు మోతాదు మించాయన్న విమర్శలు ఉన్నాయి.

తెలుగు సినిమాల్లో మహిళలను కించపరిచే విధంగా పాటలు, డ్యాన్స్ మూమెంట్స్ ఉంటున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని నేరెళ్ల శారద  తెలిపారు. ఇలాంటి కంటెంట్ ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసభ్యకరమైన పాటలు, లిరిక్స్ వల్ల యువత తప్పుదారి పట్టే అవకాశం ఉందని, మహిళలను గ్లామర్ కోణంలో చూపించడం సరికాదని కమిషన్ అభిప్రాయపడింది.

కాగా, 'పుష్ప 2', 'మిస్టర్ బచ్చన్', నితిన్ నటించిన 'రాబిన్ హుడ్' సినిమాల్లోని పాటలపై కూడా విమర్శలు రావడం తెలిసిందే.


More Telugu News