బెట్టింగ్ యాప్ కేసుపై విజయ్ దేవరకొండ టీమ్ వివరణ

బెట్టింగ్ యాప్ కేసుపై విజయ్ దేవరకొండ టీమ్ వివరణ
  • ప్రముఖుల మెడకు చుట్టుకుంటున్న బెట్టింగ్ యాప్ ల వ్యవహారం
  • ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలపై కేసు
  • విజయ్ దేవరకొండ అనుమతులు ఉన్న సంస్థలకే ప్రచారం చేశారన్న టీమ్
  • రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని వివరణ
యూట్యూబర్లకే కాదు, సినీ తారలకు కూడా బెట్టింగ్ యాప్ ల వ్యవహారం మెడకు చుట్టుకుంటోంది. విజయ్ దేవరకొండ, రానా, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత తదితరులపై కేసు నమోదైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, హీరో విజయ్ దేవరకొండ టీమ్ వివరణ ఇచ్చింది. చట్టబద్ధమైన అనుమతులు ఉన్న గేమ్స్ కే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారని టీమ్ స్పష్టం చేసింది. అది కూడా స్కిల్ బేస్డ్ గేమ్స్ కే విజయ్ ప్రకటనలు చేశారని పేర్కొంది. 

అనుమతి ఉన్న ఏ23 అనే సంస్థ తరఫున విజయ్ దేవరకొండ పనిచేశారని వివరించింది. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పిందని వెల్లడించింది. ఏ23 సంస్థతో విజయ్ దేవరకొండ ఒప్పందం గత సంవత్సరమే ముగిసిందని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఏ23సంస్థతో విజయ్ దేవరకొండకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.


More Telugu News