గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో హార్దిక్ పాండ్యా... వైర‌లవుతున్న పాత వీడియో!

గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో హార్దిక్ పాండ్యా... వైర‌లవుతున్న పాత వీడియో!
  • గ‌తేడాది ఆగ‌స్టులో శ్రీలంక ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన టీమిండియా
  • ఈ టూర్‌కి పాండ్యాతో పాటు వెళ్లిన‌ జాస్మిన్ వాలియా!
  • ఆ స‌మ‌యంలో ఇద్ద‌రూ క‌లిసి తిరిగిన వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌
మ‌రో మూడు రోజుల్లో ఐపీఎల్ 18వ సీజ‌న్ ప్రారంభం కానున్న వేళ ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ జాస్మిన్ వాలియాతో ఉన్న పాత వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. గ‌తేడాది ఆగ‌స్టులో టీమిండియా, శ్రీలంక ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో పాండ్యాతో పాటు జాస్మిన్ కూడా వెళ్లిన‌ట్లు స‌మాచారం. 

కాగా, ఇటీవ‌ల ముగిసిన ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్‌లో జ‌రిగిన భార‌త మ్యాచ్‌ల‌కు ఆమె కూడా హాజ‌రయ్యారు. దీంతో వీరి మ‌ధ్య బంధం నిజ‌మ‌నే చ‌ర్చ మొద‌లైంది. దీనికి ఇప్పుడీ పాత వీడియో మరింత బలం చేకూరుస్తోంది.

జాస్మిన్ స్టైలిష్ వైట్ సమ్మర్ డ్రెస్ ధరించి, ఎరుపు స్లింగ్ బ్యాగ్, వైట్ స్లైడర్‌లతో క్యాబ్ నుంచి దిగ‌డం వీడియోలో చూడొచ్చు. కొన్ని క్షణాల తర్వాత హార్దిక్ పాండ్యా అదే కారు నుంచి బయటకు వస్తూ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. అతడు తెల్లటి స్లీవ్‌లెస్ టీ-షర్ట్, ట్రాక్ ప్యాంట్, కౌబాయ్ టోపీలో క్యాజువల్‌గా క‌నిపించాడు.

ఇదిలా ఉంటే... హార్దిక్ పాండ్యా అతని మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్ 2024 జూలైలో విడిపోతున్నట్లు ప్రకటించిన విష‌యం తెలిసిందే. నాలుగేళ్ల త‌మ వివాహ బంధానికి స్వ‌స్తి ప‌లుకుతున్న‌ట్లు ఈ జంట జూలై 20న ఉమ్మడి ప్రకటన చేసింది. ఆ త‌ర్వాత బ్రిటిష్ గాయని, రియాలిటీ టీవీ స్టార్ అయిన‌ జాస్మిన్ వాలియాతో పాండ్యా ప్రేమాయ‌ణం న‌డుపుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.  


More Telugu News