రన్యా రావు కేసులో కోర్టులో కీలక విషయాలు వెల్లడించిన అధికారులు

రన్యా రావు కేసులో కోర్టులో కీలక విషయాలు వెల్లడించిన అధికారులు
  • సహ నిందితుడు తరుణ్‌రాజ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ
  • తరుణ్‌రాజ్‌కు రన్యా రావు ఆర్థిక సాయం చేసినట్లు వెల్లడించిన డీఆర్ఐ అధికారులు
  • రన్యా రావు పంపించిన డబ్బుతోనే దుబాయ్ నుంచి హైదరాబాద్ వెళ్లాడన్న అధికారులు
బంగారం అక్రమ రవాణా వ్యవహారంలో అరెస్టైన కన్నడ నటి రన్యా రావుకు సంబంధించిన కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ కేసులో మరో నిందితుడు తరుణ్‌రాజ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా అధికారులు న్యాయస్థానానికి పలు విషయాలు తెలియజేశారు. రన్యా రావు, తరుణ్‌రాజ్‌కు ఆర్థిక సహాయం చేసినట్లు డీఆర్ఐ అధికారుల విచారణలో తేలింది.

రన్యా రావు పంపిన డబ్బుతోనే నిందితుడు దుబాయ్ నుంచి హైదరాబాద్ వెళ్లాడని కోర్టుకు తెలిపారు. బ్యాంకాక్, జెనీవాకు బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేవారని పేర్కొన్నారు. తరుణ్‌రాజ్ దుబాయ్‌కి వెళ్లిన రోజునే తిరిగి వచ్చేవాడని తెలిపారు. బంగారం అక్రమ రవాణా కేసులో మార్చి 3వ తేదీన అధికారులు రన్యా రావును అరెస్టు చేశారు.


More Telugu News