ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఫొటో సెషన్... పవన్ ను పలకరించిన బొత్స

- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఫొటో సెషన్
- పాల్గొన్న చంద్రబాబు, పవన్, మంత్రులు
- బాగున్నారా? అంటూ పవన్ ను పలకరించిన బొత్స
ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఫొటో సెషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు పాల్గొన్నారు. తొలుత ఎమ్మెల్యేలు, ఆ తర్వాత ఎమ్మెల్సీల ఫొటో సెషన్ జరిగింది.
మరోవైపు ఈ సందర్భంగా మరో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఫొటో సెషన్ ముగించుకుని వెళుతున్న సమయంలో పవన్ కల్యాణ్ ను వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పలకరించారు. 'ఎలా ఉన్నారు? బాగున్నారా?' అని బొత్స పలకరించారు. ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు.