న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన పిటిషనర్.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు!

ఓ పిటిషనర్ విషయంలో ఈరోజు తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిన పిటిషనర్‌కు ఏకంగా రూ. 1కోటి జరిమానా విధించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక తీర్పును వెలువరించారు.
హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయాన్ని దాచిపెట్టి వేరే బెంచ్ వద్ద పిటిషన్లు దాఖలు చేయడంపట్ల న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేలా రిట్ పిటిషన్లు వేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.