గవర్నమెంట్ జాబ్ ఉన్న వరుడి కోసం రోడ్డుపై యువతి వెతుకులాట.. వీడియో ఇదిగో!

గవర్నమెంట్ జాబ్ ఉన్న వరుడి కోసం రోడ్డుపై యువతి వెతుకులాట.. వీడియో ఇదిగో!
  • పెళ్లికూతురు అలంకరణలో ఫ్లకార్డుతో నిలబడిన వైనం
  • నల్లగా ఉన్నా పర్వాలేదంటున్న యువతి
  • ప్రభుత్వ ఉద్యోగినే పెళ్లి చేసుకుంటా.. వైరల్ గా మారిన ఫ్రాంక్ వీడియో
ప్రభుత్వ ఉద్యోగానికి యువతలో ఉండే క్రేజే వేరు.. చిన్నదో పెద్దదో ప్రభుత్వ ఉద్యోగం ఉన్న అబ్బాయికే తమ కూతురును ఇచ్చి పెళ్లి చేయాలని భావించే తల్లిదండ్రులు ఎందరో.. ఎందుకింత క్రేజ్ అంటే ఒక్కసారి ఉద్యోగం సాధించామా ఇక లైఫ్ సెటిలైనట్లే. టంచనుగా ఫస్ట్ కు జీతం వస్తుంది, పనితీరు ఎలా ఉన్నా సీనియారిటీని బట్టి ప్రమోషన్లు, క్రమం తప్పకుండా వచ్చి పడే ఇంక్రిమెంట్లు.. ఇలా ఎన్నో సదుపాయాలు. దీనిపై తాజాగా ఓ యువతి సెటైరికల్ గా ఫ్రాంక్ వీడియో చేసింది. పెళ్లికూతురులా ముస్తాబై చేతిలో ప్లకార్డుతో రోడ్డుపై నిలుచుంది. ఆ కార్డుపై ‘ప్రభుత్వ ఉద్యోగం ఉన్న పెళ్లికొడుకు కోసం చూస్తున్నా’ అని రాసి చేతుల్లో పట్టుకుంది.

రోడ్డుపై వచ్చిపోయే వారిని మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారా అంటూ అడుగుతూ కాదనగానే సారీ చెప్పి పక్కకు జరుగుతోంది. నల్లగా ఉన్నా సరే ప్రభుత్వ ఉద్యోగం ఉంటే పెళ్లి చేసుకుంటానని చెబుతోంది. చివరకు ఓ మధ్యవయస్కుడు ఆమె దగ్గరకు వచ్చి తాను ప్రభుత్వ ఉద్యోగినని చెప్పడంతో సిగ్గుపడుతూ పెళ్లికి ఒప్పుకుంటుంది. అబ్బాయి ఎలా ఉన్నా పర్లేదు కానీ ప్రభుత్వ ఉద్యోగం ఉండాలని తన తండ్రి సూచించాడని ఆ యువతి చెప్పింది. ఈ ఫ్రాంక్ వీడియోను సదరు యువతి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న డిమాండ్ అలాంటిదని కామెంట్లు పెడుతున్నారు.


More Telugu News