ప్ర‌ముఖ ర‌చయిత మృతిపై రాజ‌మౌళి భావోద్వేగ పోస్ట్‌!

ప్ర‌ముఖ ర‌చయిత మృతిపై రాజ‌మౌళి భావోద్వేగ పోస్ట్‌!
  • మ‌ల‌యాళ ప్ర‌ముఖ ర‌చ‌యిత మంకొంబు గోపాల‌కృష్ణ‌న్ క‌న్నుమూత‌
  • గోపాల‌కృష్ణ‌న్ మృతిపై 'ఎక్స్' వేదిక‌గా రాజ‌మౌళి సంతాపం
  • ఆయ‌న మరణవార్త తీవ్రంగా బాధించిందంటూ ట్వీట్‌
మ‌ల‌యాళ ప్ర‌ముఖ ర‌చ‌యిత మంకొంబు గోపాల‌కృష్ణ‌న్ క‌న్నుమూశారు. గ‌త కొన్నిరోజులుగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న సోమ‌వారం మ‌ధ్యాహ్నం మృతి చెందిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. దీంతో ఆయ‌న మృతిప‌ట్ల వివిధ సినీ ఇండ‌స్ట్రీల‌కు చెందిన‌ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం తెలుపుతున్నారు. 

గోపాల‌కృష్ణ‌న్ మృతిపై ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి కూడా 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా సంతాపం వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌తో త‌న‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ జ‌క్క‌న్న‌ ఎమోష‌న‌ల్ పోస్టు పెట్టారు. 

"మంకొంబు గోపాలకృష్ణన్ సర్ మరణవార్త బాధించింది. ఆయన చిరకాల వాంఛనీయ సాహిత్యం, కవిత్వం, సంభాషణలు ఆయనపై శాశ్వత ముద్ర వేశాయి. ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ మలయాళ వెర్షన్లకు ఆయనతో కలిసి పనిచేసినందుకు కృతజ్ఞతలు. ఓం శాంతి" అని ద‌ర్శ‌క‌ధీరుడు ట్వీట్ చేశారు. 


More Telugu News