పార్లమెంటు ఆవరణలో అరకు కాఫీ స్టాల్

- అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు స్పీకర్ ఓం బిర్లాను అనుమతి కోరిన టీడీపీ ఎంపీలు
- రెండు స్టాల్స్ ఏర్పాటుకు అనుమతి
- అరకు కాఫీ గురించి గతంలో మన్ కీ బాత్ లో ప్రస్తావించిన ప్రధాని మోదీ
అరకు కాఫీకి ప్రచారం కల్పించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్లమెంట్ ప్రాంగణంలో స్టాల్స్ ఏర్పాటుకు అనుమతించాలని టీడీపీ ఎంపీలు గతంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు.
టీడీపీ ఎంపీల విజ్ఞప్తితో పార్లమెంట్ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్స్‌కు స్పీకర్ అనుమతి ఇచ్చారు. ఈ మేరకు లోక్‌సభ డిప్యూటీ కార్యదర్శి అజిత్ కుమార్ సాహూ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుకు లేఖ ద్వారా తెలిపారు.
పార్లమెంట్‌లోని సంసద్ భవన్‌లో సంగం, నలంద లైబ్రరీ వద్ద సభ్యులకు ఇబ్బంది లేకుండా స్టాల్స్ ఏర్పాటు చేసుకోవచ్చని లోక్‌సభ సచివాలయం తెలిపింది. కాగా, అరకు కాఫీ గురించి గతంలో మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ సైతం ప్రస్తావించిన విషయం తెలిసిందే.