ఓబులాపురం మైనింగ్ కేసులో బీవీ శ్రీనివాస్ రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
- సర్వే విభాగం అధికారిని మరోసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలంటూ పిటిషన్
- కేసు విచారణ సాగుతున్న నేపథ్యంలో అవకాశం కల్పించలేమన్న హైకోర్టు
- పిటిషన్‌లో సరైన కారణాలు చూపించలేదన్న హైకోర్టు
ఓబులాపురం మైనింగ్ కేసులో బీవీ శ్రీనివాస్ రెడ్డి పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో సర్వే విభాగం అధికారిని మరోసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు అనుమతివ్వాలని బీవీ శ్రీనివాస్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా, కేసు విచారణ సాగుతున్న నేపథ్యంలో అవకాశం ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. క్రాస్ ఎగ్జామినేషన్ కోసం బీవీ శ్రీనివాస్ రెడ్డి సరైన కారణాలు చూపలేదని తెలిపింది.
ఓబులాపురం అక్రమ మైనింగ్‌పై 2009లో గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు అరెస్టయ్యారు. ప్రస్తుతం వారు బెయిల్‌పై ఉన్నారు.
కేసు విచారణలో భాగంగా ఓబులాపురం గనులను పరిశీలించిన సర్వే విభాగం అధికారి అక్రమాలు చోటు చేసుకున్నట్లు నివేదికను ఇచ్చారు. సీబీఐ కోర్టులో గత ఏడాది ఈ అధికారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.
సర్వే విభాగం అధికారి తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆరు నెలల తర్వాత సీబీఐ కోర్టులో బీవీ శ్రీనివాస్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆయనను మరోసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. సీబీఐ కోర్టు ఉత్తర్వులను ఆయన తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ఈ కేసు సీబీఐ కోర్టులో విచారణ దశలో ఉన్నందున పిటిషన్‌పై విచారణ చేపట్టలేమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ కోర్టు ఈ కేసును వేగంగా విచారిస్తోందని హైకోర్టు తెలిపింది. ఈ దశలో సాక్షిని మరోసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు అవకాశం ఇవ్వలేమని తెలిపింది.