వైవీ సుబ్బారెడ్డి తల్లి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్

  • అనారోగ్యంతో బాధపడుతున్న వైవీ సుబ్బారెడ్డి తల్లి
  • సోమవారం వేకువజామున కన్నుమూత
  • రేపు మేదరమెట్లలో అంత్యక్రియలు
  • హాజరుకానున్న జగన్!
వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తల్లి యర్రం పిచ్చమ్మ (85) ఈ వేకువజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

వైవీ సుబ్బారెడ్డికి మాతృవియోగం కలగడం పట్ల వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. పిచ్చమ్మ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. 

కాగా, వైవీ సుబ్బారెడ్డి తల్లి అంత్యక్రియలు రేపు బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఉదయం 10.30 గంటలకు జరగనున్నాయి. పిచ్చమ్మ అంత్యక్రియలకు జగన్ కూడా హాజరవుతారని తెలుస్తోంది.


More Telugu News