స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. పది గ్రాముల ధర ఎంతంటే..?

--
రోజురోజుకూ పెరుగుతూ పోతున్న పసిడి ధరలు దిగొస్తున్నాయి. రెండు రోజులుగా స్వల్పంగా ధరలు తగ్గాయి. ఆదివారంతో పోలిస్తే సోమవారం ఉదయం 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.89,560 కి చేరింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు రూ. 82,100 గా ఉంది. ఆదివారంతో పోలిస్తే ఇది రూ.100 తక్కువ. ఇక కిలో వెండి ధర రూ.1,11,900 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే.. హైదరబాద్‌లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,100 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.89,560 లుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,100, 24 క్యారెట్ల బంగారం ధర రూ.89,560 ఉందని వ్యాపారులు చెబుతున్నారు.


More Telugu News