ఆకట్టుకుంటున్న‌ 'అర్జున్‌ సన్నాఫ్ వైజయంతి' టీజ‌ర్..!

  • కల్యాణ్ రామ్, ప్రదీప్ చిలుకూరి కాంబోలో 'అర్జున్‌ సన్నాఫ్ వైజయంతి'
  • ప్రధాన పాత్రలో విజయశాంతి
  • కల్యాణ్ రామ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా సాయి మంజ్రేకర్
  • తల్లీ కొడుకుల మధ్య ప్రేమ, వైరం, సెంటిమెంట్ నేపథ్యంలో మూవీ    
కల్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం 'అర్జున్‌ సన్నాఫ్ వైజయంతి'.  లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కల్యాణ్ రామ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా సాయి మంజ్రేకర్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు, టైటిల్ పోస్టర్, ఇటీవ‌ల వదిలిన ప్రీ-టీజర్ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా మేక‌ర్స్‌ టీజర్‌ను విడుద‌ల చేశారు.

హైవోల్టేజ్ యాక్షన్ సీన్స్, ఎమోషనల్ మూమెంట్స్ కలబోసిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. అజనీశ్‌ లోకనాథ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ టీజర్ లో హైలైట్ గా నిలిచింది. విజువల్స్ కూడా ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. ఇక టీజ‌ర్‌లో విజయశాంతి వైజయంతి అనే పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించగా.. ఆమె కొడుకు పాత్రలో కల్యాణ్ రామ్ కనిపించారు. నెక్స్ట్ పుట్టిన‌రోజు నాటికి పోలీస్ గా ఖాకీ డ్రెస్ లో చూడాలని వైజయంతి తన కుమారుడిని కోరుతుంది. 

అయితే, కొన్ని అనుకోని పరిస్థితుల్లో పోలీస్ అవ్వాల్సిన హీరో... కత్తి పట్టుకొని రౌడీల మీద యుద్ధానికి బయలుదేరినట్లు టీజ‌ర్‌లో చూపించారు. కాగా, తల్లీ కొడుకుల మధ్య ప్రేమ, వైరం, సెంటిమెంట్ నేపథ్యంలో  'అర్జున్‌ సన్నాఫ్ వైజయంతి' సినిమా రూపొందినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.

అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రంలో  బాలీవుడ్ న‌టుడు సోహైల్ ఖాన్ ప్ర‌తినాయ‌కుడిగా న‌టించారు. శ్రీకాంత్ మేక, బబ్లూ పృథ్వీరాజ్ ఇతర కీలక పాత్రల్లో క‌నిపించ‌నున్నారు. 





More Telugu News