విజయవాడలో పర్యటించిన మహేశ్ బాబు అర్ధాంగి నమ్రత

 
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అర్ధాంగి నమ్రత శిరోద్కర్ నేడు విజయవాడలో పర్యటించారు. మదర్స్ మిల్క్ బ్యాంక్ ను ఆమె ప్రారంభించారు. విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ మిల్క్ బ్యాంకు ప్రాజెక్టుకు రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ నిధులు సమకూర్చింది. 

ఈ సందర్భంగా నమ్రత మాట్లాడుతూ, అనేక సందర్భాల్లో శిశువులకు తల్లి పాలు అందక ఇబ్బందులు ఎదురవుతుంటాయని, అలాంటి వారికి ఈ మదర్స్ మిల్క్ బ్యాంక్ ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. 

ఆంధ్ర హాస్పిటల్స్ ఎండీ రమణమూర్తి మాట్లాడుతూ... మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ ను నివారించే వ్యాక్సిన్ కోసం మహేశ్ బాబు ఫౌండేషన్ తో కలిసి కృషి చేస్తున్నట్టు చెప్పారు.


More Telugu News