365 రోజుల వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్.. వివరాలు ఇవిగో!

  • కేవలం రూ.1198 రీచార్జితో ఏడాది పాటు వాలిడిటీ
  • సెకండరీ నంబర్‌గా వాడే వినియోగదారులకు ఎంతో ఉపయోగకరం
  • నెలకు 300 నిమిషాలు అవుట్ గోయింగ్ కాల్స్ సదుపాయం
ప్రభుత్వ రంగ టెలికమ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆసక్తికరమైన ప్లాన్‌లను అందిస్తోంది. తాజాగా అత్యంత చౌకైన, సరసమైన ప్రీ పెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. బీఎస్ఎన్ఎల్ సిమ్‌ను సెకండరీ నంబర్‌గా వాడే వినియోగదారులకు ఈ ప్లాన్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. 

వినియోగదారుడికి ఎక్కువ భారం కాకుండా అందుబాటులో ఉన్న ఈ ప్లాన్ వివరాల్లోకి వెళితే.. 365 రోజుల (ఏడాది) ప్లాన్ ధర రూ.1198 లు మాత్రమే. దీని ప్రకారం నెలవారీ సగటు ఖర్చు వంద రూపాయలు మాత్రమే అవుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు సిమ్ యాక్టివ్‌గా ఉండాలనుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ బాగా వర్క్ అవుట్ అవుతుంది. 

ప్రతి నెల 300 నిమిషాల వరకు ఏ నెట్ వర్క్‌కు అయినా కాలింగ్ సదుపాయంతో పాటు ప్రతి నెలా 30 ఉచిత ఎస్ఎంఎస్‌లు, ప్రతి నెలా 3 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తాయి. అంతే కాకుండా దేశం అంతటా రోమింగ్ సమయంలో ఉచిత ఇన్ కమింగ్ కాల్స్ ప్రయోజనాన్ని కూడా పొందుతారు. 


More Telugu News