విజయసాయి కుమార్తె స్థలంలో కాంక్రీట్ నిర్మాణాల తొలగింపు

  • విశాఖ భీమిలి బీచ్‌లో నేహారెడ్డి స్థలంలో అక్రమ కాంక్రీట్ నిర్మాణాలు తొలగించాలని ఆదేశించిన హైకోర్టు
  • హైకోర్టు ఆదేశాలతో పూర్తిగా అక్రమ కాంక్రీట్ కట్టడాలను ధ్వంసం చేసిన అధికారులు 
  • జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ పిటిషన్‌తో అక్రమ కాంక్రీట్ కట్టడాలు తొలగింపు
వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డి స్థలంలో కాంక్రీట్ నిర్మాణాలను విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. హైకోర్టు అదేశాలతో పది అడుగుల మేర భూమి లోపల వరకు తవ్వి కాంక్రీట్ గోడలను ధ్వంసం చేశారు. 

విశాఖ జిల్లా భీమిలి బీచ్‌లో విజయసాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డి అక్రమ కాంక్రీట్ నిర్మాణాలను కూల్చివేయాలని గతంలోనే ఏపీ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో టౌన్ ప్లానింగ్ అధికారులు పైపైన నిర్మాణాలు తొలగించి చేతులు దులుపుకున్నారు. 

అక్రమ నిర్మాణాలను పాక్షికంగా తొలగించడంపై పిటిషనర్, జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మరోసారి హైకోర్టును ఆశ్రయించడంతో, అక్రమ నిర్మాణాలు పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. దీంతో అధికారులు నిన్న పూర్తిగా అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యలు చేపట్టారు. 


More Telugu News