గెలవక ముందు 'జనసేనాని'.. గెలిచాక 'భజన సేనాని': ప్ర‌కాశ్ రాజ్

   
శుక్ర‌వారం రాత్రి జ‌న‌సేన జ‌య‌కేత‌నం స‌భ‌లో ఆ పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడిన మాట‌ల‌పై న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్) వేదిక‌గా మ‌రోసారి కౌంట‌ర్ ఇచ్చారు. "గెలవక ముందు 'జనసేనాని', గెలిచిన తరువాత 'భజన సేనాని'... అంతేనా? అని ప్ర‌శ్నించారు. హిందీ వ‌ద్దంటూ ద‌క్షిణాది రాష్ట్రాల‌కు మ‌ద్ద‌తుగా ప‌వ‌న్ గ‌తంలో చేసిన పోస్టుల్ని ఈ ట్వీట్‌కి ఆయ‌న జ‌త చేశారు.

కాగా, నిన్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ప్ర‌కాశ్ రాజ్ ఓ ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే. బ‌హుభాషా విధానంపై ఏపీ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్య‌ల‌కు న‌టుడు కౌంట‌ర్ ఇచ్చారు. హిందీ భాష‌ను త‌మ‌పై రుద్ద‌కండి అంటూ చెప్ప‌డం ఇంకో భాష‌ను ద్వేషించ‌డం కాద‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. స్వాభిమానంతో త‌మ మాతృభాష‌ను, త‌ల్లిని కాపాడుకునే ప్ర‌య‌త్న‌మ‌నే విష‌యాన్ని ప‌వ‌న్‌కి ద‌య‌చేసి ఎవ‌రైనా చెప్పాల‌ని ప్ర‌కాశ్ రాజ్ కోరారు.  


More Telugu News