రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీకి అందుకే వెళ్లలేకపోయా: మంచు విష్ణు

రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీకి అందుకే వెళ్లలేకపోయా: మంచు విష్ణు
  • 'కన్నప్ప' ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న మంచు విష్ణు
  • ఏ ప్రభుత్వమూ చిత్ర పరిశ్రమకు వ్యతిరేకంగా లేదన్న మంచు విష్ణు
  • తన సినిమాలో కమర్షియల్ అంశాలు ఉంటాయన్న మంచు విష్ణు
ఫ్యామిలీ ఈవెంట్ వల్ల గత ఏడాది డిసెంబర్ నెలలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీకి వెళ్లలేకపోయానని ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు అన్నారు. 'కన్నప్ప' చిత్రం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆయన ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వమూ చిత్ర పరిశ్రమకు వ్యతిరేకంగా లేదని ఆయన చెప్పారు.

'కన్నప్ప' చిత్రంలోని లవ్ పాటపై ఛానల్ ప్రతినిధి ప్రశ్నించారు. భక్తి సినిమాలో గ్లామర్ ఉండటంపై నెట్టింట విమర్శలు రావడాన్ని మంచు విష్ణు దృష్టికి తీసుకువెళ్లారు. తాను సినిమాను తీస్తున్నాను కానీ, డాక్యుమెంటరీ కాదని కాబట్టి కమర్షియల్ అంశాలు ఉంటాయని ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు అన్నారు.

విష్ణు స్పందిస్తూ, రెండో దశాబ్దంలో దుస్తులు ఏ విధంగా ఉన్నాయని ప్రశ్నించారు. కొంతమంది విమర్శించాలనే కోణంలోనే చూస్తారని వ్యాఖ్యానించారు. శివుడి పాటను కూడా విమర్శించిన వారు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి విమర్శలను చూసి తాను నవ్వుకుంటానని పేర్కొన్నారు.

తాను పెట్టిన బడ్జెట్‌కు ఓటీటీకి అమ్మలేనని, అయినా తమ మార్కెటింగ్ టెక్నిక్స్ తమకు ఉన్నాయని విష్ణు అన్నారు. ఈ చిత్రం తన కెరీర్‌లో పెద్ద రిస్కుగా భావిస్తున్నానని, ఆ శివుడి పైనే భారం వేశానని పేర్కొన్నారు.


More Telugu News