తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన నా తమ్ముడు నాగేంద్రబాబుకు అభినందనలు: చిరంజీవి

- ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు
- ఏకగ్రీవంగా ఎన్నికైన జనసేన అభ్యర్థి నాగబాబు
- విషెస్ తెలిపిన చిరంజీవి
సినీ నటుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. దీనిపై నాగబాబు సోదరుడు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.
ఎమ్మెల్సీగా ఎన్నికై, ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తొలిసారి అడుగుపెట్టబోతున్న నా తమ్ముడు నాగేంద్రబాబుకు నా అభినందనలు, ఆశీస్సులు అంటూ ట్వీట్ చేశారు.
"ప్రజా సమస్యలపై గళం విప్పుతూ, వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడేలా నువ్వు చేసే కృషిలో అన్ని వేళలా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ప్రజల అభిమానాన్ని మరింతగా పొందాలని ఆశిస్తూ నీకు నా శుభాకాంక్షలు" అంటూ చిరంజీవి తన సోదరుడికి విషెస్ తెలియజేశారు.