సీఎం రేవంత్‌ ఢిల్లీ నుంచి సాధించిన పని లేదు... తెచ్చిన రూపాయి లేదు: కేటీఆర్‌

సీఎం రేవంత్‌ ఢిల్లీ నుంచి సాధించిన పని లేదు... తెచ్చిన రూపాయి లేదు: కేటీఆర్‌
  • ముఖ్య‌మంత్రి రేవంత్‌పై 'ఎక్స్' వేదికగా కేటీఆర్ ధ్వజం
  • సీఎం 39 సార్లు ఢిల్లీ వెళ్లి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నార‌ని విమ‌ర్శ‌
  • హామీల అమ‌లు చేత‌గాక గాలి మాట‌లు, గ‌బ్బు కూత‌లు అని మాజీ మంత్రి మండిపాటు
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మ‌రోసారి సీఎం రేవంత్ రెడ్డిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా తీవ్ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. ముఖ్య‌మంత్రి 39 సార్లు ఢిల్లీ వెళ్లి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నార‌ని, కానీ అక్క‌డి నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తేలేద‌ని కేటీఆర్ దుయ్య‌బ‌ట్టారు. 

ఓటేసి మోసపోయాం అని జ‌నం చివాట్లు పెడుతుంటే ఢిల్లీలో చ‌క్క‌ర్లు కొడుతున్నావ్ అని ధ్వ‌జ‌మెత్తారు. నీళ్లు లేక పంట‌లు ఎండిపోతే క‌నీసం సాగునీళ్ల‌పై స‌మీక్ష కూడా చేయ‌డం లేద‌న్నారు. మొహం బాగోలేక అద్దం పగలగొట్టినట్లు... ఆడ లేక పాతగజ్జెలు అన్నట్లు హామీల అమ‌లు చేత‌గాక గాలి మాట‌లు, గ‌బ్బు కూత‌లు అని మాజీ మంత్రి మండిప‌డ్డారు. 


More Telugu News