రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి హోలీ విషెస్‌

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి హోలీ విషెస్‌
   
దేశ వ్యాప్తంగా హోలీ సంబ‌రాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. యువ‌త‌ ఒక‌రిపై ఒక‌రు రంగులు పూసుకుంటూ రంగుల పండుగ‌ హోలీని ఆనందోత్సాహాల‌తో జ‌రుపుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పండుగ జోరుగా జరుగుతోంది. ఈ క్ర‌మంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా హోలీ శుభాకాంక్ష‌లు తెలిపారు. 

"స‌ప్త‌వ‌ర్ణ శోభితం.. స‌క‌ల జ‌నుల సంబురం.. ప్ర‌జ‌లంద‌రికీ హోలీ శుభాకాంక్ష‌లు" అంటూ సీఎం ట్వీట్ చేశారు. అలాగే ఈ రంగుల పండుగ‌ను అంద‌రూ వైభ‌వోపేతంగా జ‌రుపుకోవాల‌ని అన్నారు. ఈ పండుగ అంద‌రీ కుటుంబాల్లో ఆనందాలు నింపాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. 


More Telugu News