ఆమెతో డేటింగ్‌లో ఉన్నా: ఆమిర్ ఖాన్‌

ఆమెతో డేటింగ్‌లో ఉన్నా: ఆమిర్ ఖాన్‌
  • గురువారం త‌న 60వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మీడియాతో ముచ్చ‌టించిన ఆమిర్‌
  • ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్న బాలీవుడ్ హీరో
  • గౌరీ స్ప్ర‌త్‌తో ఏడాది కాలంగా డేటింగ్‌లో ఉన్న‌ట్లు వెల్ల‌డి
  • త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారత్'పై కీల‌క వ్యాఖ్య‌లు 
  • స‌ల్మాన్ ఖాన్‌, షారూఖ్ ఖాన్‌తో స్నేహ‌బంధం గురించి మాట్లాడిన న‌టుడు
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ గురువారం త‌న 60వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మీడియాతో ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారత్', స‌ల్మాన్ ఖాన్‌, షారూఖ్ ఖాన్‌తో స్నేహ‌బంధం, త‌న స్నేహితురాలు గౌరీ స్ప్ర‌త్‌తో డేటింగ్ ఇలా ప‌లు ఆస‌క్తిక‌ర విషయాల‌ను ఆయ‌న విలేక‌రులతో పంచుకున్నారు. 

గౌరీతో త‌న‌కు పాతికేళ్ల ఫ్రెండ్‌షిప్ ఉన్న‌ట్లు తెలిపారు. గ‌త ఏడాది కాలంగా ఆమెతో డేటింగ్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. బెంగ‌ళూరుకు చెందిన ఆమె త‌న‌ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌లో ప‌నిచేస్తున్న‌ట్లు ఆమిర్ చెప్పారు. గౌరీకి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. 2021లో త‌న భార్య కిర‌ణ్ రావుతో ఆమిర్ విడాకులు తీసుకున్న విష‌యం తెలిసిందే. అంత‌కుముందు రీనా ద‌త్తాను పెళ్లి చేసుకొని విడిపోయారు. 
   
అలాగే త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారత్' స్క్రిప్ట్ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. స్క్రిప్ట్‌ వర్క్‌ మాత్రమే మొదలు పెడుతున్నామ‌ని చెప్పిన ఆయ‌న‌... దీని కోసం ఒక టీమ్ ను సిద్ధం చేసే పనిలో ఉన్నామ‌ని చెప్పారు. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం తాము ఎన్నో విషయాల గురించి అన్వేషిస్తున్నామ‌ని, ఏం జరుగుతుందో చూడాల‌ని ఆమిర్ పేర్కొన్నారు. ఇక స‌ల్మాన్‌, షారూఖ్‌ల‌తోనూ త‌న‌కు మంచి అనుబంధం ఉంద‌న్నారు. బుధ‌వారం నాడు వారిద్ద‌రినీ క‌లిసిన‌ట్లు తెలిపారు. తమ ముగ్గురి కలయికలో సినిమా వస్తే బాగుంటుందని తామూ అనుకుంటున్నామని, అయితే మంచి స్క్రిప్టు దొరకాలనీ, దాని కోసమే ఎదురు చూస్తున్నామని ఆమిర్ నవ్వుతూ చెప్పారు.  


More Telugu News