చంద్ర‌బాబు పేరు 'సూర్య‌'బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌

చంద్ర‌బాబు పేరు 'సూర్య‌'బాబుగా మారుతుందేమో: డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌
  • శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చర్చ
  • సీఎం చంద్రబాబు, రఘురామకృష్ణరాజు మధ్య ఆసక్తికర సంభాషణ
  • 'చంద్రబాబు ఇక సూర్యబాబు' అంటూ సీఎంపై ఆర్ఆర్ఆర్‌ సరదా వ్యాఖ్యలు
శాస‌న‌స‌భ‌లో విద్యుత్‌ రంగంపై లఘు చ‌ర్చ సంద‌ర్భంగా డిప్యూటీ స్పీకర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంభాష‌ణ జ‌రిగింది. విద్యుత్ సంస్కరణలో భాగంగా సోలార్ పై సభ్యులకు ముఖ్య‌మంత్రి మంచి ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. 

ఇక‌ చంద్రబాబు ప్రసంగం పూర్త‌యిన వెంటనే డిప్యూటీ స్పీకర్ ఆర్ఆర్ఆర్‌ సీఎంపై చమత్కారంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సోలార్ రూఫ్ టాప్ లక్ష్యాన్ని సాధిస్తే చంద్రబాబు నాయుడు పేరు ఇక నుంచి 'సూర్య'బాబు నాయుడుగా మారుతుందని అన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ 'మీరు నాకు కరెంట్‌ షాక్‌ ఇవ్వాలనుకుంటున్నారు' అని అన‌డంతో సభలో నవ్వులు విరిశాయి. ఇక ఈ నెల 18న స‌భ్యులంతా త‌ప్ప‌కుండా స‌భ‌కు హాజ‌రు కావాల‌ని, ఆ రోజు సీఎం చంద్ర‌బాబు హాజ‌ర‌వుతారు క‌నుక గ్రూప్ ఫొటో తీసుకుంటే అదొక గుర్తుగా ఉంటుంద‌ని డిప్యూటీ స్పీక‌ర్ పేర్కొన్నారు. 


More Telugu News