ఏపీలో పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

ఏపీలో పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
  • ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
  • ఎస్ఎస్‌సీ హాల్ టికెట్‌తో దరఖాస్తు చేసుకునే అవకాశం
  • వెబ్‌సైట్‌లో మెటీరియల్, పాత ప్రశ్నాపత్రాలు 
ఆంధ్రప్రదేశ్‌లో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ (AP Polycet 2025) కు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి విద్యార్ధులు తమ ఎస్ఎస్‌సీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి దరఖాస్తు చేయవచ్చు. 

ఈ పరీక్షకు సంబంధించి పాత ప్రశ్నాపత్రాలు, మెటీరియల్ (తెలుగు, ఇంగ్లీషు మీడియం) ను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఏపీ పాలిసెట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఆన్‌లైన్ దరఖాస్తు, మెటీరియల్, పాత ప్రశ్నాపత్రాల కొరకు క్లిక్ ఇక్కడ చేయండి, పాలిసెట్ స్టడీ మెటీరియల్ (తెలుగు), స్టడీ మెటీరియల్ (ఇంగ్లీషు) 
 
ఇక, ఏపీ పాలిసెట్ పరీక్ష ఏప్రిల్ 30న జరగనుంది. ఆబ్జెక్టివ్ విధానంలో జరిగే ఈ పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. మ్యాథమెటిక్స్ నుంచి 50, ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 30 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు, నెగిటివ్ మార్కులు లేవు. ఓసీ, బీసీ అభ్యర్ధులు రూ.400లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులైతే రూ.100లు దరఖాస్తు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. 


More Telugu News