ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం మారిన ర్యాంకులు... కోహ్లీని వెనక్కినెట్టిన రోహిత్ శర్మ

ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం మారిన ర్యాంకులు... కోహ్లీని వెనక్కినెట్టిన రోహిత్ శర్మ
  • తాజా వన్డే ర్యాంకులు విడుదల చేసిన ఐసీసీ
  • రోహిత్ శర్మకు 3వ ర్యాంకు
  • ఐదో స్థానానికి పడిపోయిన కోహ్ల
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి మూడవ స్థానానికి చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ ఐదో స్థానానికి పడిపోయాడు. 

ఫైనల్‌లో 83 బంతుల్లో 76 పరుగులు చేసిన రోహిత్ 756 రేటింగ్ పాయింట్లతో మూడవ స్థానానికి చేరుకున్నాడు. శుభ్‌మన్ గిల్ 784 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజమ్ 770 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో 243 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ 8వ స్థానంలో నిలకడగా ఉన్నాడు.

బౌలర్ల ర్యాంకింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ మూడవ స్థానానికి, రవీంద్ర జడేజా పదవ స్థానానికి చేరుకున్నారు. కుల్దీప్ యాదవ్ ఛాంపియన్స్ ట్రోఫీలో 7 వికెట్లు తీయగా... రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీశాడు.

ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించిన న్యూజిలాండ్ ఆటగాళ్లు డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ కూడా బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మెరుగుదల కనబరిచారు. కివీస్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ (9 వికెట్లు) రెండో స్థానానికి చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.





More Telugu News