నన్ను మేడం అని పిలవొద్దు: నారా భువనేశ్వరి

నన్ను మేడం అని పిలవొద్దు: నారా భువనేశ్వరి
  • దత్తత తీసుకున్న కొమరువోలు గ్రామంలో పర్యటించిన భువనేశ్వరి
  • గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న భువనేశ్వరి
  • గ్రామస్తులందరూ ఒ కుటుంబంలా కలిసి ఉండాలన్న భువనేశ్వరి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి ఈరోజు తాను దత్తత తీసుకున్న కృష్ణా జిల్లా కొమరువోలు గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ... తనను మేడమ్ అని పిలవొద్దని, నేను మీ భువనమ్మను అని చెప్పారు. కొమరవోలుకు రావడం సంతోషంగా ఉందని అన్నారు. 

కొమరవోలును తాను ఎప్పుడూ మర్చిపోనని భువనేశ్వరి చెప్పారు. గ్రామస్తులందరూ ఒక కుటుంబం మాదిరి కలిసి ఉండాలని అన్నారు. అందరం కలిసి గ్రామానికి మంచి చేసుకుందామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామంలో కనీసం రోడ్ల మరమ్మతు కూడా జరగలేదని అన్నారు. 

పామర్రు ఎమ్మెల్యే కుమార్ రాజా మాట్లాడుతూ... దత్తత తీసుకున్న తర్వాత గ్రామాన్ని భువనమ్మ ఎంతో అభివృద్ధి చేశారని కొనియాడారు. కొమరువోలు ప్రజలు భువనమ్మ సేవలను తరతరాలుగా గుర్తుంచుకుంటారని చెప్పారు. గ్రామస్తుల తరపున భువనమ్మకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు.


More Telugu News