గాయని కల్పన వ్యవహారంపై స్పందించిన కూతురు

  • ఒత్తిడి కారణంగానే తన తల్లి నిద్రమాత్రలు అధికంగా తీసుకుందని వెల్లడి
  • తన తల్లి ఆత్మహత్యాయత్నం చేయలేదని స్పష్టీకరణ
  • తప్పుడు కథనాలు సృష్టించవద్దని విజ్ఞప్తి
ప్రముఖ గాయని కల్పన తన కూతురుతో గొడవ కారణంగానే ఆత్మహత్యాయత్నం చేసిందని ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంపై కల్పన కూతురు స్పందించారు. తల్లి విషయం తెలియగానే కేరళలో ఉంటున్న కూతురు హుటాహుటీన హైదరాబాద్ చేరుకున్నారు. పోలీసులు ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఒత్తిడి కారణంగానే తన తల్లి నిద్రమాత్రలు ఎక్కువగా తీసుకోవడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిందంటూ కూతురు మీడియా ముందు చెప్పారు.

ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఒత్తిడి కారణంగానే ఒకింత ఎక్కువ మోతాదులో తన తల్లి నిద్రమాత్రలు తీసుకున్నదని తెలిపారు. తన తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారని, వారు చాలా బాగా ఉంటున్నారని చెప్పారు. తన తల్లి ఆత్మహత్యాయత్నం చేయలేదని స్పష్టం చేశారు. దయచేసి తప్పుడు కథనాలు సృష్టించవద్దని మీడియాను కోరారు.

స్టేట్‌మెంట్ రికార్డు చేసిన పోలీసులు

తన తల్లి డాక్టర్ రాసిన నిద్రమాత్రలనే వేసుకుందని, మానసిక ప్రశాంతత కోసం వాటిని వేసుకుంటోందని పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో కల్పన కూతురు చెప్పారు. తమ కుటుంబంలో ఎలాంటి సమస్య లేదని వెల్లడించారు. తన తల్లి మానసిక ఒత్తిడికి గురవుతూ, నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పారు.


More Telugu News