గాయని కల్పనకు వెంటిలేటర్‌పై చికిత్స.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

  • నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన సింగర్ కల్పన
  • ఆసుపత్రికి వచ్చిన సింగర్లు కారుణ్య, శ్రీకృష్ణ, గీతామాధురి, సునీత తదితరులు
  • ఆత్మహత్యకు గల కారణంపై పోలీసుల ఆరా
ఆత్మహత్యకు యత్నించిన ప్రముఖ సినీ నేపథ్య గాయని కల్పనకు హైదరాబాదు, నిజాంపేటలోని ఓ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి పలువురు సినీ ప్రముఖులు ఆసుపత్రికి వచ్చారు. వీరిలో గాయనీగాయకులు శ్రీకృష్ణ, సునీత, గీతామాధురి, కారుణ్య తదితరులు ఉన్నారు. వైద్యులను అడిగి ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు.

హైదరాబాద్‌లోని నిజాంపేటలో ఉంటున్న కల్పన నిన్న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆమె ఫ్లాట్‌కు చేరుకుని తలుపులు బద్దలుకొట్టి ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. అయితే, ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణాలు తెలియరాలేదు. విషయం తెలిసి హైదరాబాద్ చేరుకున్న కల్పన భర్త ప్రసాద్‌ను పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది.


More Telugu News