ఆన్ లైన్ లో ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ ముసాయిదా చట్టం: మంత్రి నారా లోకేశ్

- టీచర్ల బదిలీలను పారదర్శకంగా చేపడతామన్న మంత్రి లోకేశ్
- అందుకే ముసాయిదా చట్టం రూపొందించామని వెల్లడి
- సలహాలు, సూచనలు అందించాలని పిలుపు
ఉపాధ్యాయుల బదిలీలను పారదర్శకంగా చేపట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. లోపరహితమైన బదిలీల ప్రక్రియ కోసమే నియంత్రణ ముసాయిదా చట్టం రూపొందించామని, దీన్ని ఆన్ లైన్ లో ఉంచుతున్నామని వివరించారు.
రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పటిష్టతపై దృష్టిసారించామని తెలిపారు. cse.ap.gov.in/documents/DRAF పోర్టల్ లో సలహాలు, సూచనలను అందించాలని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. అంతేగాకుండా... draft.aptta2025@gmail.com ఈమెయిల్ ఐడీకి మార్చి 7వ తేదీ లోపు పంపవచ్చని వెల్లడించారు.