మధురానగర్ లో మందేసి హంగామా సృష్టించిన జూనియర్ ఆర్టిస్ట్... వీడియో ఇదిగో!

మధురానగర్ లో మందేసి హంగామా సృష్టించిన జూనియర్ ఆర్టిస్ట్... వీడియో ఇదిగో!
 
హైదరాదులో ఓ మహిళా జూనియర్ ఆర్టిస్ట్ మద్యం మత్తులో హల్ చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మేకల సరిత అనే ఆర్టిస్ట్ ఫుల్లుగా మందు కొట్టి మధురానగర్ లో నడిరోడ్డుపై హంగామా సృష్టించింది. 

చరణ్ అనే వ్యక్తిని నానా తిట్టుతిట్టిన సరిత... దారిన పోయేవారిని సైతం నోటికొచ్చినట్టు మాట్లాడింది. ఓ మహిళా హోంగార్డు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఆ హోంగార్డు పట్ల కూడా దురుసుగా ప్రవర్తించింది. 

చివరికి ఆమె భర్త రాజేశ్ కు ఫోన్ చేసిన మధురానగర్ పోలీసులు... అతడిసాయంతో ఆమెను అక్కడ్నించి తరలించారు. ఆ జూనియర్ ఆర్టిస్ట్ పై కేసు నమోదు చేశారు.


More Telugu News