ఓటీటీకి వచ్చేసిన మలయాళ మూవీ .. 'స్వర్గం'

ఓటీటీకి వచ్చేసిన మలయాళ మూవీ .. 'స్వర్గం'
  • మలయాళంలో నిర్మితమైన సినిమా 
  • ప్రధానమైన పాత్రలో నటించిన అజూ వర్గీస్ 
  • 4 కోట్లతో నిర్మితమైన సినిమా ఇది 
  • వినోదం .. సందేశం కలిసి నడిచే కథ

మలయాళ సినిమాలకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై విశేషమైన ఆదరణ లభిస్తోంది. అందువలన వారం తిరుగుతూ ఉండగానే మలయాళం నుంచి విపరీతమైన కంటెంట్ ఓటీటీ సెంటర్లకు వచ్చి చేరుతోంది. అలా నిన్నటి నుంచి 'సైనా ప్లే' ఓటీటీ తెరపైకి 'స్వర్గం' అనే మలయాళ సినిమా వచ్చింది. అజూ వర్గీస్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, రెజిస్ ఆంటోని దర్శకత్వం వహించాడు. 

క్రితం ఏడాది నవంబర్ 8వ తేదీన ఈ సినిమాను థియేటర్లకు తీసుకుని వచ్చారు. బిజిబల్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, కేవలం 4 కోట్ల రూపాయలతో నిర్మించారు. అయితే థియేటర్స్ వైపు నుంచి ఆశించిన స్థాయిలో ఈ సినిమాకి రెస్పాన్స్ రాలేదు. కానీ ఓటీటీ వైపు నుంచి అనూహ్యమైన స్పందన వస్తోందని అంటున్నారు. 

కథ విషయానికి వస్తే, పక్క పక్కనే ఉన్న రెండు కుటుంబాల నేపథ్యంలో నడుస్తుంది. ఒకటి సాధారణమైన ఫ్యామిలీ .. మరొకటి ధనవంతుల కుటుంబం. సాధారణమైన ఫ్యామిలీకి చెందిన వారు హ్యాపీగా ఉంటే, డబ్బున్నవారు నానా ఇబ్బందులు పడుతుంటారు. మనిషి సంతోషంగా బ్రతకడానికి కావలసింది ధనమా? సఖ్యతనా? అనేది ఆలోచింపజేసే సినిమా ఇది. 



More Telugu News