ఆ సినిమా నాకు క‌న్నీళ్లు తెప్పించింది: డైరెక్ట‌ర్ శంక‌ర్‌

ఆ సినిమా నాకు క‌న్నీళ్లు తెప్పించింది: డైరెక్ట‌ర్ శంక‌ర్‌
  • ప్రదీప్ రంగనాథన్ న‌టించిన 'డ్రాగ‌న్'పై ఎక్స్ వేదిక‌గా శంక‌ర్‌ ప్ర‌శంస‌లు 
  • అందమైన క‌థా చిత్రం... అద్భుతమైన రచన అంటూ కితాబు
  • మూవీలోని ఆఖ‌రి 20 నిమిషాలు త‌న‌ను భావోద్వేగానికి గురి చేశాయ‌ని ట్వీట్
  • 'థ్యాంక్యూ సో మ‌చ్ స‌ర్‌' అని రిప్లై ఇచ్చిన ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌
యువ న‌టుడు ప్రదీప్ రంగనాథన్ న‌టించిన 'డ్రాగ‌న్' చిత్రంపై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ప్ర‌శంస‌లు కురిపించారు. ఇది ఒక అందమైన క‌థా చిత్రం అని, అద్భుతమైన రచన అంటూ కితాబిచ్చారు. మూవీలోని ఆఖ‌రి 20 నిమిషాలు త‌న‌ను భావోద్వేగానికి గురిచేశాయ‌ని ట్వీట్ చేశారు. గొప్ప చిత్రం తీసినందుకు చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ మేర‌కు ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైన డ్రాగన్ చిత్రంపై తన సమీక్షను పంచుకున్నారు.

"డ్రాగ‌న్‌... ఓ అద్భుత‌మైన క‌థా చిత్రం. క‌థ‌ను ర‌చించిన తీరు అత్య‌ద్భుతంగా ఉంది. అశ్వ‌త్ మారిముత్తుకు హ్యాట్సాఫ్. పాత్ర‌ధారులంతా చాలా బాగా న‌టించారు. రాఘ‌వ‌న్ పాత్రలో ప్రదీప్ రంగనాథన్ మ‌రోసారి త‌న‌లోని అద్భుత‌మైన న‌టుడిని మ‌న‌కి ప‌రిచ‌యం చేశారు. జార్జ్ మ‌రియ‌న్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, ముస్కిన్ పాత్ర‌లు ఎప్ప‌టికీ గుర్తుండిపోతాయి. 

సినిమాలోని ఆఖ‌రి 20 నిమిషాలు నాకు క‌న్నీళ్లు తెప్పించాయి. మోసాలాతో నిండిపోతున్న స‌మాజానికి ఇలాంటి సందేశాలు చాలా అవ‌స‌రం. చిత్ర బృందానికి అభినంద‌న‌లు" అంటూ శంక‌ర్ త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు. 

ఇక శంక‌ర్ ట్వీట్‌కు ప్రదీప్ రంగనాథన్ స్పందించారు. "స‌ర్‌... మీ నుంచి ఇలాంటి స్పంద‌న వ‌స్తుంద‌ని ఎప్పుడూ ఊహించ‌లేదు. మీ సినిమాలు చూస్తూ పెరిగాను. ఒక అభిమానిగా ఎప్ప‌టికీ మీ నుంచి స్ఫూర్తి పొందుతుంటాను. మీ నుంచి వ‌చ్చిన అద్భుత‌మైన రెస్పాన్స్ కు నాకు మాట‌లు రావ‌డం లేదు. దీనిని నేను న‌మ్మ‌లేక‌పోతున్నా. థ్యాంక్యూ సో మ‌చ్ స‌ర్‌" అని రిప్లై ఇచ్చారు. 

ఇక 'ల‌వ్‌టుడే' మూవీతో తెలుగులోనూ ప్రదీప్ రంగనాథన్ అంద‌రికీ బాగా ప‌రిచ‌య‌మైన విష‌యం తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి డ్రాగ‌న్ తో తెలుగువారిని ప‌ల‌క‌రించాడు. రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్ పేరుతో తెలుగులో విడులైన ఈ చిత్రం మ‌నోళ్ల‌ను బాగానే ఆక‌ట్టుకుంటోంది. 




More Telugu News