విడదల రజనికి స్వల్ప ఊరట

- పిల్లి కోటిని ఇబ్బందులు పెట్టిన కేసు
- విడదల రజని ఆదేశాల మేరకే ఇబ్బంది పెట్టారంటూ కోటి పిటిషన్
- కులం పేరుతో దూషించారన్న కోటి
వైసీపీ నాయకురాలు, మాజీ మత్రి విడదల రజనికి ఏపీ హైకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. రజని, ఆమె పీఏతో పాటు పోలీసులు వేధించారంటూ చిలకలూరిపేట నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు పిల్లి కోటి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టానంటూ 2019లో అప్పటి పట్టణ సీఐ సూర్యనారాయణ తనను అరెస్ట్ చేశారని... తనను కోర్టులో ప్రవేశపెట్టకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. విడదల రజనీ ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందని తెలిపారు. కులం పేరుతో తనను వేధించారని చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ... వారు స్పందించలేదని అన్నారు. అందుకే న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పారు.
పిటిషన్ ను విచారించిన హైకోర్టు... రజనితో పాటు ఆమె పీఏపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది.
పిటిషన్ ను విచారించిన హైకోర్టు... రజనితో పాటు ఆమె పీఏపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది.