కుంభమేళాలో కొనసాగుతున్న భక్తుల తాకిడి... 52 కోట్ల మంది పుణ్య స్నానాలు

- ప్రయాగ్‌రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు రికార్డుస్థాయిలో భక్తులు
- జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా
- ఈ నెల 26 వరకు కొనసాగనున్న ఆధ్యాత్మిక కార్యక్రమం
యూపీలోని ప్రయాగ్‌రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. కోట్లాదిగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో కుంభమేళా ప్రారంభమైన గత నెల 13వ తేదీ నుంచి ఇప్పటి వరకూ రికార్డు స్థాయిలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించినట్లు అధికారులు వెల్లండించారు.
త్రివేణి సంగమంలో ఇప్పటి వరకూ 52 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ప్రకటించింది. దీంతో ప్రపంచంలోనే ఇంత మంది భక్తులు పాల్గొన్న మొదటి కార్యక్రమంగా కుంభమేళా రికార్డు సృష్టించింది.
కాగా, జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా... ఈ నెల 26 వరకు కొనసాగనుంది. దాదాపు 45 రోజుల పాటు జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 40 కోట్ల మంది భక్తులు వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముందుగా అంచనా వేసింది. అయితే, అంచనాలకు మించి భక్తులు తరలివస్తున్నారు.