కేసీఆర్ పాలనను అసహ్యించుకోవడానికి 9 ఏళ్లు పడితే, రేవంత్ పాలనను 9 నెలలకే అసహ్యించుకుంటున్నారు: ఈటల

కేసీఆర్ పాలనను అసహ్యించుకోవడానికి 9 ఏళ్లు పడితే, రేవంత్ పాలనను 9 నెలలకే అసహ్యించుకుంటున్నారు: ఈటల
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మరన్న ఈటల
  • కేసీఆర్ పాలనలో ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైందని విమర్శలు
  • కేంద్ర నిధులతోనే బీఆర్ఎస్ పనలు చేపట్టిందని స్పష్టీకరణ
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనను అసహ్యించుకోవడానికి 9 ఏళ్లు పడితే, రేవంత్ రెడ్డి పాలనను 9 నెలలకే అసహ్యించుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ప్రజల నమ్మరని అన్నారు. కేసీఆర్ పాలనలో ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైందని వ్యాఖ్యానించారు. కేంద్ర నిధులతోనే బీఆర్ఎస్ అభివృద్ధి పనులు చేపట్టిందని ఈటల స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంలో 70కి పైగా మంత్రులు ఉంటే, అందులో 30కి పైగా బీసీ మంత్రులు ఉన్నారని వివరించారు.  

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు అభ్యర్థులు కరవయ్యారు: లక్ష్మణ్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అభ్యర్థులు కరవయ్యారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. బీజేపీ అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా గెలిపిస్తే ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అవుతారని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ సర్కారు అవినీతిలో కూరుకుపోయిందని... గత ప్రభుత్వంలో 3-4 శాతం కమీషన్ తీసుకుంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 12 శాతం వరకు కమీషన్ తీసుకుంటున్నారనివిమర్శించారు.


More Telugu News